సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (14:37 IST)

భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని?

నటీమణులు ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ (29) ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాల్లో నటిస్తున్న ఈమె అలహాబాద్ నుంచి ము

నటీమణులు ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ (29) ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాల్లో నటిస్తున్న ఈమె అలహాబాద్ నుంచి ముంబైలోని జుహూ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో బస చేస్తోంది. శ్రీవాస్తవకు ఆమె కుటుంబీకులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటి ఓనర్‌కు కాల్ చేశారు. 
 
దీంతో అంజలి ఫ్లాటుకు వెళ్లిన ఓనర్.. మరో కీతో ఫ్లాటును తెరచి చూశాడు. ఆ సమయంలో గదిలోని సీలింగ్ ఫ్యానుకు అంజలి శ్రీవాస్తవ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి షాక్ తిన్నాడు. ఆపై ఫ్లాట్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. శ్రీవాస్తవ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం రిపోర్టుకు పంపారు. అయితే శ్రీవాస్తవ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.