శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:45 IST)

రాత్రికి వస్తే డబ్బిస్తానని నీచంగా మాట్లాడుతున్నాడు.. హాట్ బాంబ్ కోయినా ఫిర్యాదు

బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ హాట్ బాంబ్ కోయినా మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గడిచిన వారం రోజుల్లో 50 ఫోన్ నెంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, తొలుత కాల్స్‌ను పట్టించుకోలేదని కానీ వేధింపులు మరి

బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ హాట్ బాంబ్ కోయినా మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గడిచిన వారం రోజుల్లో 50 ఫోన్ నెంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, తొలుత కాల్స్‌ను పట్టించుకోలేదని కానీ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పింది.

రాత్రికి వస్తే డబ్బిస్తానని నీచంగా మాట్లాడుతున్నారని తెలిపింది. కోయినా మిత్రా ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు. కాల్స్ వచ్చిన నెంబర్ల ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, రోడ్, హే బేబీ, ముసాఫిర్, ఏక్ హసీనా ఏక్ ఖిలాడీ తదితర చిత్రాలతో పాటు, పలు బాలీవుడ్ సినిమాల్లో కోయినా మిత్రా ఐటం సాంగ్స్ చేసి పాప్యులర్ అయింది. 
 
మరోవైపు ఫేస్‌బుక్ అకౌంట్లో వివాహిత ఫోటోలను అసభ్యంగా పోస్ట్ చేస్తూ వేధిస్తున్న నిందితుడిపై సత్యనారాయణపురం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేదారేశ్వరపేటకు చెందిన వివాహిత (23) రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంది. 
 
అప్పట్లో తన ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకున్న ఆమె అనంతరం ఆ అకౌంట్‌ను వాడట్లేదు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఆమె అకౌంట్‌ నుంచి ఫొటోలు సేకరించి అసభ్యంగా పోస్ట్‌ చేస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.