శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (12:29 IST)

నమో వేంకటేశాయకు గ్లామర్ టచ్ ఇచ్చిన ప్రగ్య.. రాఘవేంద్ర స్టైల్‌లో రొమాన్స్ పాట..

కంచెలో తన అంద చందాలతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది. కృష్ణ వంశీ 'నక్షత్రం', మంచు మనోజ్ 'గుంటూరోడు', బోయపాటి న్యూ మూవీ, నాగార్జున 'నమో వేంకటేశాయ' వంటి స

కంచెలో తన అంద చందాలతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది. కృష్ణ వంశీ 'నక్షత్రం', మంచు మనోజ్ 'గుంటూరోడు', బోయపాటి న్యూ మూవీ, నాగార్జున 'నమో వేంకటేశాయ' వంటి సినిమాల్లో విభిన్న రోల్స్‌తో ఆకట్టుకోనుంది. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబోలో 'నమో వేంకటేశాయ' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ భక్తి సినిమాకి ప్రగ్యా గ్లామర్ టచ్ ఇచ్చిందట.
 
వెంకన్న భక్తుడైన హథీరాం బాబా చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవేంద్రరావు తన మార్క్ రొమాన్స్ ప్రగ్యా చేత చేయించాడట. ఈ మూవీలో హథీరాంని ఇష్టపడే భవానీ క్యారెక్టర్ చేసిందట ప్రగ్యా . ఎప్పుడూ కలల్లో విహరిస్తూ రొమాన్స్ చేస్తుందట భవానీ క్యారెక్టర్. అలా డ్రీమ్స్‌లో నాగార్జున- ప్రగ్యాల మధ్య ఓ డ్యూయెట్ పాటను రాఘవేంద్ర రావు తెరకెక్కించారట. ఈ పాటలో రాఘవేంద్ర రావు రొమాన్స్ మార్క్ కనబడుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.