నా రియల్ లైఫ్ లవ్ స్టోరీనే ప్రేమమ్ చిత్ర కథ ... నిజ జీవితంలో ముగ్గురిని ప్రేమించా : నాగ చైతన్య
తాను నటించిన తాజా చిత్రం 'ప్రేమమ్' కథ నా నిజజీవిత ప్రేమకథేనని టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో తాను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించానని, చివరకు హీరోయిన్ సమంతను వివాహం చే
తాను నటించిన తాజా చిత్రం 'ప్రేమమ్' కథ నా నిజజీవిత ప్రేమకథేనని టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో తాను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించానని, చివరకు హీరోయిన్ సమంతను వివాహం చేసుకోనున్నట్టు చెప్పాడు.
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తన వ్యక్తిగత విషయమన్నారు. ఈ పెళ్లికి, సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పెళ్ళికి, సినిమాకు లింకు పెట్టకూడదన్నారు.
ఇకపోతే తన తాజా చిత్రం ప్రేమమ్‌లో ముగ్గురు హీరోయిన్లతో ప్రేమ సాగుతుందన్నారు. ఇది అచ్చం తన జీవిత ప్రేమకథేనన్నారు. తాను కూడా హైస్కూల్‌లో ఉండగా ఒక అమ్మాయిని ప్రేమించానని, కాలేజీలో ఉండగా మరో అమ్మాయిని ఇపుడు సమంతను ప్రేమించినట్టు నాగచైతన్య చెప్పాడు. ఇదే విధంగా ప్రేమమ్ కథ కూడా సాగుతుందన్నారు