1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (12:51 IST)

''నిన్నే పెళ్లాడతా'' టైటిల్‌ రీమిక్స్‌కు ఫిక్స్ అయిపోయిన నాగ చైతన్య

రీమిక్స్ చేసేందుకు ప్రస్తుతం హీరోలు ఏమాత్రం వెనుకాడట్లేదు. పాటల విషయంలో రీమిక్స్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్స్ విషయంలోనూ అంతే. తాజాగా నాగచైతన్య కూడా తన తండ్రి నటించిన సినిమా టైటిల్

రీమిక్స్ చేసేందుకు ప్రస్తుతం హీరోలు ఏమాత్రం వెనుకాడట్లేదు. పాటల విషయంలో రీమిక్స్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్స్ విషయంలోనూ అంతే. తాజాగా నాగచైతన్య కూడా తన తండ్రి నటించిన సినిమా టైటిల్ మీద మనసు పడ్డాడని సమాచారం. నాగార్జున కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిన చిత్రం "నిన్నే పెళ్లాడతా''. 
 
కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేమ, కుటుంబ ఆప్యాయతలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఈ టైటిల్ అంటే నాగచైతన్యకు చాలా ఇష్టమట. అందుకే ఇప్పుడు తను చేయబోయే సినిమాకు టైటిల్‌గా ''నిన్నే పెళ్ళాడతా''ను పెట్టుకోవాలని చైతు భావిస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మొదట 'కళ్యాణం' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.