శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 26 మే 2017 (08:02 IST)

నాన్న జడ్జిమెంట్ ఫర్‌ఫెక్ట్.. నమ్మి చేశాను ‘రారండోయ్‌... వేడుక చూద్దాం’ అదుర్స్ అంటున్న నాగచైతన్య

ఎప్పుడూ ఒకే రకం లవ్ స్టోరీలు చేసుకుంటూ పోతుంటే కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లాలంటే ఆ లవ్ స్టోరీలో ఏదో ఉండాలి అని నాన్న చెప్పిన సలహా పాటించినందుకు కెరీర్‌లో మంచి సినిమా చేసిన తృప్తి మిగిలిందని నాగ చైతన్య చెప్పారు. తానూ, రకుల్

ఎప్పుడూ ఒకే రకం లవ్ స్టోరీలు చేసుకుంటూ పోతుంటే కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లాలంటే ఆ లవ్ స్టోరీలో ఏదో ఉండాలి అని నాన్న చెప్పిన సలహా పాటించినందుకు కెరీర్‌లో మంచి సినిమా చేసిన తృప్తి మిగిలిందని నాగ చైతన్య చెప్పారు. తానూ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నాగార్జున నిర్మించిన చిత్రం రారండోయ్.. వేడుక చూద్దాం శుక్రవారం విడుదల అవుతున్న సందర్బంగా నాగచైతన్య ఈ సినిమాలోని కొత్త దనం గురించి పంచుకున్నారు. అన్నట్లు శుక్రవారం తొలి ఆట ఇప్పటికే పూర్తయింది. ఆడియన్స్ పస్ట్ రియాక్షన్ సూపర్బ్ అని వచ్చేసింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానులు చెప్పాం, వచ్చాం, కొట్టాం అంటూ కేరింతలు కొడుతున్నారు.
 
నాన్న చెప్పిన మాటలను నమ్మి ఆత్మవిశ్వాసంతో నాగచైతన్య వేసుకున్న అంచనా నిజమైంది. నాన్న మాటని నమ్మి చేశాను. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాన్నగారైతే సినిమాను చాలాసార్లు చుశారు. అవుట్‌పుట్‌ బాగా రావడంతో ఆయనతో పాటు యూనిట్‌ అంతా మూవీ సూపర్‌ సక్సెస్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి, నా కెరీర్‌కి హెల్ప్‌ అవుతుంది అని గురువారం సాయంత్రం నాగచైతన్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
ఫస్ట్‌ టైమ్‌ నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి, ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు నన్ను ఇంత ఎనర్జిటిక్‌ రోల్‌లో యాక్సెప్ట్‌ చేస్తారా అనే డౌట్‌ ఉండేది. ‘ఇలాంటి క్యారెక్టర్‌ చేస్తే, నీ బాడీ లాంగ్వేజ్‌ సెట్‌ అవుతుంది’ అని నాన్న అన్నారు. కల్యాణ్‌కి కమర్షియల్‌ పల్స్‌ బాగా తెలుసు. తను కూడా ప్రోత్సహించాడు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగుంటాయి. ఇప్పటివరకు నేను చేసిన లవ్‌ స్టోరీస్‌ హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్‌ గురించే ఉంటాయి.
 
కానీ, ఈ సినిమాలో ఓ తండ్రికి, ఓ కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ, ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంఘర్షణ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్లు ఒక ఎమోషనల్‌ బాండేజ్‌కు ఎలా కనెక్ట్‌ అయి ఉంటారు అనే విషయాలతో హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది అన్నారు నాగచైతన్య. నాగార్జున, నాగ చైతన్య నమ్మకం వమ్ము కాలేదని రారండోయ్.. వేడుక చూద్దాం సినిమా ఫస్ట్ షో స్పందనలు వచ్చేశాయి కూడా.