''శ్రీమంతుడు'' భార్య రాజకీయాల్లోకి రానుందా...?
టాలీవుడ్ టాప్ హీరో అయిన ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గత ఏడాది కొరటాల దర్శకత్వంలో 'శ్రీమంతుడు' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సంవ
టాలీవుడ్ టాప్ హీరో అయిన ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గత ఏడాది కొరటాల దర్శకత్వంలో 'శ్రీమంతుడు' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినప్పటికీ తాజాగా మురుగదాస్‌తో ఓ సెన్సేషనల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక మహేష్ ఇండస్ట్రీలో తన సహనటి నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార. వీరిద్దరిని చూసుకుంటూ.. మహేష్ బాబు కెరీర్‌పై పూర్తిగా శ్రద్ధ పెట్టిన నమ్రత.. ప్రస్తుతం రాజకీయాల్లోకి రానుందనే టాక్ వస్తోంది. అందుకే మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ గ్రామాభివృద్ధిలో నమ్రత పాలుపంచుకుంటోంది. ఆమె నిర్వాహాన్ని చూసి ఆ గ్రామ ప్రజలు మెచ్చుకుంటున్నారు. నమ్రత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి నమ్రత ఏం చేస్తుందో..
ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్ ఆధారిత లైవ్ టీవీ, ఆన్ డిమాండ్ సేవలు అందిస్తున్న యప్ టీవీ నూతన ప్రచార కర్తగా మహేష్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.