గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (22:12 IST)

నందమూరి తారకరత్న ఇకలేరు

tarakaratna
నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. గత కొద్దిరోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స తీసుకుంటూ వచ్చిన తారకరత్న శనివారం కన్నుమూశారు. నారాయణ హృదయాలయకు విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 
 
కాగా నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు పంపారు. అప్పటినుంచి చికిత్స కొనసాగింది. కానీ చివరికి తారకరత్న ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.