ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (11:37 IST)

పెళ్లిపీటలెక్కనున్న హీరో నారా రోహిత్ - ఆదివారం నిశ్చితార్థం

nara rohit - siree
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో పెళ్లి పీటలెక్కనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడుగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్. ఈయన నటించిన తొలి చిత్రం "బాణం". ఈ చిత్రంతోనే అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించిన నారా రోహిత్.. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి పెళ్లిపీటలెక్కనున్నారు. ఆయన ఓ యువ నటిని వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం ఆదివారం జరుగనుంది. ప్రతినిధి-2 చిత్రంలో ఆయన సరసన నటించిన సిరి లేళ్ల అనే హీరోయిన్‌ను నారా రోహిత్ పెళ్ళి చేసుకోబోతున్నారు. నారా రోహిత్ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, నారా రోహిత్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.