టూ పీస్‌తో బిగ్ బి మనవరాలు నవ్యా నవేలి బోటు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్!
బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి తరుచూ వార్తల్లోకెక్కుతుంది. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని రొమాన్స్ చేస్తోందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన యువకుడి ఒళ్లో కూర్చున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేయడంతో మరోసారి పెను దుమారం రేగింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు నవ్య బికినీలో కనిపించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 18 ఏళ్ల నవ్య గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో థాయ్‌లాండ్‌లోని పుకెట్ దీవుల్లో స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంది. టూ పీస్ డ్రెస్ ధరించి ఫ్రెండ్స్‌తో హుషారుగా బోటులో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకి ఇప్పటికే లక్షలాది కామెంట్స్ వచ్చాయి. నవ్య చాలా క్యూట్‌గా, గ్లామర్‌గా ఉందని, ఆమె బాలీవుడ్‌లోకి వస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బచ్చన్ ఫ్యామిలీ ఏది చేసిన సంచలనమే కదా. మరి నవ్య బికినీపై అమితాబ్ బచ్చన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.