శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (14:17 IST)

జై లవ కుశలో రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్.. సెప్టెంబర్ 21న రిలీజ్..

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జై లవ కుశ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జర

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జై లవ కుశ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. గతంలో 'రామ్ లీలా' షూటింగ్ జరుపుకున్న భవనంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇందులో భాగంగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చేనెల 12వ తేదీన హైదరాబాదులో ఘనంగా ఆడియో వేడుక జరుగనుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సెప్టెంబర్ 21న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
 
ఇకపోతే.. జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాశిఖన్నా, నివేధా థామస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.