గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 జనవరి 2025 (16:25 IST)

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ

Payal Rajput new movie poster
Payal Rajput new movie poster
'ఆర్ఎక్స్ 100' మూవీ ముద్దుగుమ్మ మంగళవారం ఫేమ్ పాయల్‌ రాజ్‌పుత్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ సారి ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయలేనంత ఫర్ఫామేన్స్ తో ఈ బ్యూటీ కనిపించబోతోంది. సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ & అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నం. 1' చిత్రం సిద్ధం కాబోతుంది.
 
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మూవీ మేకర్స్ ప్రకటిస్తారు.