శుక్రవారం, 27 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జూన్ 2016 (13:28 IST)

పవర్ ఫ్యాన్స్‌కు అనుగుణంగా హుషారు.. హీరోయిన్ ఎవరో తెలుసా?

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న హుషారు సినిమా కోసం పవన్ కల్యాణ్ రెడీ అయిపోయాడు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపుదిద్దుకునే హుషారు సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. శ్రుతిహాసన్ లేదా రకుల్ ప్రీత్ సింగ్ వీరిద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేసే చిత్ర యూనిట్.. పవర్ స్టార్ స్టామినాకు తగ్గట్టు స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం. 
 
గెటప్ మేకోవర్‌తో పాటు.. ఫ్యాన్స్‌ని థ్రిల్ చేయడం కోసం పవన్ ఈ సినిమాలో అద్భుత నటనను ప్రదర్శిస్తాడని దర్శకుడు ఎస్ జే సూర్య చెప్తున్నారు. ప్రేక్షకులను హుషారు సినిమా తప్పకుండా థ్రిల్ చేస్తుందని ఆయన అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని సూర్య చెప్తున్నారు. 
 
పవన్ కళ్యాణ్ - ఎస్ జే సూర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో పవన్ శక్తి సామర్థాలకు అనుగుణంగా స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాయలసీయ ఫ్యాక్షనిస్ట్‌గా పవన్ తొలిసారి పవన్ కనిపించనున్నాడని.. అటు యాక్షన్ - ఇటు ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ రెండూ సమపాళ్లలో మిక్స్ అయి - ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని దర్శకుడు సూర్య అంటున్నారు.