సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 జూన్ 2016 (12:21 IST)

అ.. ఆ.. సినిమా చూసిన పవన్ కల్యాణ్.. రావు రమేష్ డైలాగ్స్ అదుర్స్ అంటూ కితాబు!

లవర్ బాయ్ నితిన్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ఇటీవల, త్రివిక్రమ్-నితిన్-సమంత కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న అ.. ఆ.. సినిమా షూటింగ్ స్పాట్‌కెళ్లిన పవన్ కల్యాణ్, ఈసారి అ..ఆ.. సినిమాను థియేటర్లో చూశారు. ముఖ్యంగా రావు రమేష్ చెప్పిన డైలాగులు పవన్‌కు బాగా నచ్చాయట. వీలును బట్టి నితిన్ అ.. ఆ... సినిమాను మరోసారి చూస్తానని పవన్ తెలపడంతో త్రివిక్రమ్ హ్యాపీగా ఉన్నారని తెలిసింది. 
 
కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ., సినిమా నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల ద్వారా రూపొందింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా ఈ సినిమాను చూసి ఆనందించినట్లు వార్తలొస్తున్నాయి. 
 
అంతేగాకుండా ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్, నటుడు రావు రమేష్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. అ.. ఆ.. మూవీ షూటింగ్ సమయంలో సెట్‌కి వెళ్ళిన పవన్, ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.