బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2016 (17:34 IST)

నీతి, నిజాయతీ లేని వ్యక్తులు ఎంత సాధించినా నిష్పలమే: పవన్ కల్యాణ్

నీతి, నిజాయితీ లేని వ్యక్తులు ఎంత సాధించినా అది నిష్ఫలమేనని ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్‌ వేడుకలు త

నీతి, నిజాయితీ లేని వ్యక్తులు ఎంత సాధించినా అది నిష్ఫలమేనని ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్‌ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటున్నట్టు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సర్వమానవాళికి ప్రేమను పంచినప్పుడే శాంతి, ఆనందం ఉంటుందని క్రీస్తు బోధించారని ఆయన గుర్తుచేసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే.. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు విషయమై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన ప్రకటించారు. ఈ నిర్ణయంలో మోడీ పాత్రే ఎక్కువ కాబట్టి పవన్ పరోక్షంగా ఆయనపై విమర్శలు గుప్పించినట్లైంది. ముందు నోట్ల రద్దును స్వాగతించివ పవన్, ఆ తర్వాత జనాల ఇబ్బందులను చూసి పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు అంశంపై మండిపడ్డారు. నోట్ల రద్దుతో జనాలు ఇబ్బంది పడుతున్నారని, నోట్లు రద్దు చేసే ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు.