నేను రహస్యంగా పెళ్ళి చేసుకోలేదు.. నా సిస్టర్‌కే మ్యారేజ్ జరిగింది: పూనమ్ బజ్వా
నటి పూనమ్ బజ్వా పెండ్లి చేసుకుందని.. అదీ రహస్యంగా పెళ్ళి తంతు పూర్తయ్యిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ కొద్ది సేపటికే పెళ్ళి చేసుకుంది తాను కాదని, తన సోదరి అని చెప్తోంది. బాస్, పరుగు చిత్రాల్లో నటించిన బజ్వా దర్శకుడు సునీల్‌రెడ్డితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ దర్శకుడు ప్రస్తుతం 'తిక్క' అనే సినిమాతో బిజీగా వున్నాడు.
అసలు పూనమ్ ఎందుకలా చేసిందనే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ.. ఇటీవలే వివాహం అయింది తన సోదరికనీ.. తను కొద్దిగా తన పోలికలే వుంటాయని దీంతో మీడియా కన్‌ఫ్యూజ్ అయివుంటుందని తెలివిగా చెబుతోంది.