సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (12:09 IST)

పూనమ్ పాండేపై రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. అరెస్ట్ చేయాలని?

Poonam Pandey
నటి పూనమ్ పాండే ఇటీవల తన మరణాన్ని నకిలీదని డ్రామా చేసింది. తన మరణాన్ని ప్రచార కార్యక్రమంగా పేర్కొంది. దీంతో పూనమ్ పాండేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తన మరణాన్ని బూటకమని పూనమ్ పాండే పేర్కొంది. ఫలితంగా పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం ఫిర్యాదు దాఖలైంది. 
 
ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి కాన్పూర్ పోలీస్‌లో కేసు నమోదు చేశాడు. పూనమ్ పాండే, ఆమె భర్త నటి మరణాన్ని అబద్ధం చేయడానికి కుమ్మక్కయ్యారని, క్యాన్సర్ తీవ్రతను చిన్నబుచ్చారని అన్సారీ పేర్కొన్నాడు. ఇలా చేయడం వలన చాలామంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. అందుకని వారిద్దరినీ అరెస్టు చేసి, కాన్పూర్ కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.