శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (08:41 IST)

నాలుగేళ్ల తర్వాత బాహుబలి ప్రభాస్ కొత్త సినిమా నేడే ప్రారంభం

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించిన ప్రభాస్ ఎట్టకేలకు కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న కొత్త చిత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సుజిత్ ఆదివారం ట్వీట్ చేస్తూ ప్ర

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించిన ప్రభాస్ ఎట్టకేలకు కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న కొత్త చిత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సుజిత్ ఆదివారం ట్వీట్ చేస్తూ ప్రభాస్‌కు ప్రియమైన వారికి, శ్రేయోభిలాషులకు శుభవార్త చెబుతున్నానని, ప్రభాస్ కొత్తచిత్రానికి సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 
 
ప్రభాస్ ప్రొడక్షన్‌లో 2014లో తెలుగు రొమాంటిక్ కామెడీ రన్ రాజా రన్ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సుజిత్ తీస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ పవర్ పుల్ పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నట్వు సమాచారం. విధినిర్వహణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. బాహుబలి కోసం పెంచిన దేహదారుఢ్యాన్ని తగ్గించుకుని ఈ కొత్త సినిమాకోసం ప్రభాస్ సన్నబడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తన పాత్రపై కసరత్తు ప్రారంభించాడని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి.
 
భారతీయ సినిమా చరిత్రలో అవాంతరాలు, అంతరాయాలు లేకుండా ఒక సినిమాకు దర్శకుడు, హీరో తదితర నటీనటులు నాలుగేళ్ల సమయం వెచ్చించడం బాహుబలికే సాధ్యమైంది. బాలివుడ్ సినీ నిర్మాతలకు, దర్శకులకు నేటికీ అర్థం కాని విషయం అది. ఎట్టకేలకు ప్రభాస్ బాహుబలి మేనియా నుంచి విముక్తుడు అయినట్లే మరి.