ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (19:15 IST)

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

Prabhas-kamal
Prabhas-kamal
ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా కల్కి 2898 ఎడి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం. వైజయంతి మూవీస్ బేనర్ లో రూపొందుతోంది. ఈ కథ సైన్స్ ఫిక్షన్ కథా ఇప్పటివరకు ప్రమోషన్ లో చూపించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రం స్పూర్తి మహాభారంతోని పాత్రలని తెలుస్తోంది. ముఖ్యంగా కల్కి అవతారం అనేది విష్ణు అవతారం చివరి రూపం కలికాలంలో వచ్చే అవతారం అని అందరికీ తెలిసిందే.
 
కాగా,  “కల్కి 2898 ఎడి” లో అమితాబ్ బచ్చన్  పాత్ర అశ్వథామ పాత్ర చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. ఇక ప్రభాస్ పాత్ర విష్ణు రూపంగా కనిపించనుందనీ, కమల్ హాసన్ పాత్ర కంసుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే మహాభారతంలోని కంసుడిలా కాకుండా ఈనాటి ట్రెండ్ కు తగినట్లు కంసుడిగా వుంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జూన్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.