ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (12:34 IST)

మరోసారి "పుష్ప-2" వాయిదా పడనుందా?

pushpa-2 the ruler
అల్లు అర్జున్ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదా? ముందుగా 2024 ఆగస్టు నెలలో రిలీజ్ అని ఆశ పెట్టి మళ్లీ డిసంబర్ నెలకు వాయిదా వేశారు. కానీ ఈ సినిమా ఇపుడు మళ్లీ వచ్చే సంవత్సరం సమ్మర్‌కి వాయిదా వేయనున్నట్టు సమాచారం. హీరోకి, డైరెక్టర్‌కి మధ్య స్క్రిప్ట్ విషయంలొ విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో రూమర్స్ రావడం, ఆ కారణంగానే బన్నీ డేట్స్ ఇవ్వట్లేదని, అంతేకాకుండా ఇపుడు బన్నీ షేవింగ్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం ఈ వార్తలకు బలాన్నిస్తుంది. 
 
అదేకాకుండా ఫ్యామిలీతో బన్నీ ఫారిన్ ట్రిప్ వెళ్ళడం, అదేసమయానికి డైరెక్టర్ సుకుమార్ ఫారిన్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్నారు అని సమాచారం. సినిమాలో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చినపుడు "పుష్ప" టీం వాడుకోలేకపోయింది. ఇపుడు ఫహద్ డేట్స్ అవసరం అయిన సమయంలో ఆయన వేరే సినిమాలతో బిజీ ఉన్నారని తెలుస్తోంది. దీంతో "పుష్ప-2" మరోసారి వాయిదా పడనుందా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.