బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (13:53 IST)

వెంకీ-మహేష్ బాబులకు తండ్రిగా రజినీకాంత్, ఆయన ఏమన్నారో తెలుసా?

Rajinikanth
కర్టెసి-ట్విట్టర్
ఆపరా... అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నాలుక చీరేస్తా... ఈ పవర్‌ఫుల్ డైలాగ్ ఎవరిదో వేరే చెప్పక్కర్లేదు. పెదరాయుడు చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారిది. ఆయన ఆ చిత్రంలో కొద్దిసేపు నటించినా చిత్రానికి ఆయువుపట్టులాంటి పాత్ర. అలాంటి రజినీకాంత్ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక అసలు విషయానికి వస్తే... వెంకటేష్-మహేష్ బాబు కలిసి నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
 
ఈ సినిమాలో వెంకీ-మహేష్ బాబులకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. కానీ వాస్తవానికి ఆ పాత్రలో దక్షిణది సూపర్ స్టార్ రజినీకాంత్ ను నటింపజేయాలని శ్రీకాంత్ అనుకున్నారట. నేరుగా చెన్నై వెళ్లి రజినీ గారికి కథ కూడా చెప్పారట. కథ మొత్తం విన్న తర్వాత రజినీకాంత్... కథ అద్భుతంగా వుంది. ఐతే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా నేను నటించలేనని సున్నితంగా తిరస్కరించారట. ఆ విషయాన్ని శ్రీకాంత్ అడ్డాల ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు.