మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:37 IST)

నాని, శర్వానంద్‌లను చూస్తే జెలసీగా ఫీలవుతా.. నాన్న మెచ్చుకున్నారు.. కళ్లల్లో నీళ్లు తిరిగాయ్

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ 'ధృవ' సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. చరణ్‌కు యువహీరోలు శర్వానంద్‌, నానిలను చూస్తే చాలా అసూయట. 'శర్వానంద్‌, నాని కథల

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ 'ధృవ' సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. చరణ్‌కు యువహీరోలు శర్వానంద్‌, నానిలను చూస్తే చాలా అసూయట. 'శర్వానంద్‌, నాని కథలను ఎంపికచేసుకునే విధానం తనకు అసూయను కలుగచేస్తుంటుందని చెప్పాడు. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతానని చెప్పాడు. వాళ్లలాగానే తనకూ విభిన్నమైన కథల్లో నటించాలని ఉంటుంద'ని తన మనసులో మాట బయటపెట్టాడు. 
 
కాగా చెర్రీకి తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతర హీరోల సినిమాలు విజయవంతమైనపుడు ఫోన్‌ చేసి అభినందిస్తుంటాడు. ఇలా మహేష్‌, ఎన్టీయార్‌, అఖిల్‌, ప్రభాస్‌, రానాతో చరణ్‌కు మంచి స్నేహమున్న సంగతి తెలిసిందే.
 
చెర్రీ ఇంకా మాట్లాడుతూ.. ‘ధృవ' సినిమాలో కథే హీరో....ఓ బలమైన కథలో నటించడం వల్లే తనకు ఏ సినిమాకీ రానన్ని ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. సాధారణంగా నాన్నగారు తన సినిమాలు చూశాక డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చెబుతుంటారు.

కానీ ‘ధృవ' విషయంలో మాత్రం తన నటన గురించి మాట్లాడారు. కథకీ, పాత్రకీ ఎంత కావాలో అంత పర్‌ఫెక్ట్‌గా చేశావని మెచ్చుకొన్నారు. ఆ మాట విన్నప్పుడు ఆనందంతో తన కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.