శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (12:03 IST)

నయీంకు కరాచీకి చెందిన వ్యక్తితో లింకు.. మరదలి పట్ల ఎంత ఘోరంగా..?: వర్మ

గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా ఆయన విడుదల చేశాడు. అప్పటి నుంచి వర్మకి నయీం అనుచరు

గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా ఆయన విడుదల చేశాడు. అప్పటి నుంచి వర్మకి నయీం అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తాను తీయబోమే సినిమా కోసం ముంబై జైలులో ఉన్న నయీం సన్నిహితుడిని, నయీంకు సాయం చేసిన ఐదుగురు పోలీసులను కూడా కలిసొచ్చానని ధైర్యం చెప్పాడు. అంతేకాదు తాను నయీంతో మూడేళ్లు కలిసి పనిచేసిన ఇద్దరు నక్సలైట్లను కూడా కలిసినట్లు చెప్పాడు.
 
నయీం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నానని, నయీంకి కరాచీకి చెందిన ఓ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తెలిసి షాక్‌కు గురైనట్లు తెలిపాడు. నయీం తన మరదలి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించాడో కూడా తెలుసుకున్నట్లు వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గతంలో నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తాను ఓ చిత్రాన్ని తీయనున్నట్లు ట్విట్టర్లో వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ.. సదరు చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి నయీమ్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాను. నక్సలైట్ నుంచి ఇన్ఫార్మర్, అక్కడనుంచి గ్యాంగ్ స్టర్‌గా రూపాంతరం చెందిన తీరు ఆసక్తిగొలిపేదే. ఆ తర్వాత అతడు నెంబర్ వన్ క్రిమినల్‌గా మారిన తీరు భీతిగొలిపేదేనని చెప్పుకొచ్చాడు. నయీమ్ స్టోరీ చాలా సంక్లిష్టంగా ఉంది.

దీనిని ఒకే సినిమాలో చెప్పడం కష్టం. అందుకే నయీమ్ స్టోరీని మూడు భాగాలుగా చిత్రీకరించాలని నిర్ణయించానని వర్మ తెలిపాడు. రక్త చరిత్ర రెండు భాగాలుగానే వచ్చింది. నయీమ్ చిత్రం మాత్రం మూడు భాగాలుగా వస్తుంది’’ అని రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లలో వెల్లడించారు.