1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (16:14 IST)

మా ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పండి : హీరోల ఫ్యాన్స్‌కు రాంగోపాల్ వర్మ ట్వీట్

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ప్రశ్న సంధించాడు. కాకినాడ సభలో పవన్ కల్యాణ్ పాడిన పాట బాగుందా? లేక ‘వంగవీటి’ చిత్రంలో తాను పాడిన ‘చంపరా’ అనే పాట బాగుందా అంటూ దర్శకుడు

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ప్రశ్న సంధించాడు. కాకినాడ సభలో పవన్ కల్యాణ్ పాడిన పాట బాగుందా? లేక ‘వంగవీటి’ చిత్రంలో తాను పాడిన ‘చంపరా’ అనే పాట బాగుందా అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు.
 
తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని చెప్పాలని అన్నారు. అంతేకాకుండా, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్‌లను ఈ విషయమై మీడియా ప్రశ్నించాలని వర్మ తన దైన శైలిలో ట్వీట్ చేశారు.
 
అంతేకాదు పవన్ కల్యాణ్ తన పేరును ‘చె పవన్ గద్దర్ కల్యాణ్ గువేరా’గా మార్చుకోవాలంటూ ఓ సటైర్ కూడా విసిరాడు. కొన్ని విషయాల్లో పవన్ ఎంత గొప్పోడైనా కావచ్చని.. కానీ, కాకినాడ సభలో పవన్ పాడిన పాట విన్నాక అతడి గొంతుకన్నా తన గొంతే బాగుందని పేర్కొన్నాడు. 
 
అంతేకాదు తాను ప్రస్తుతం తీస్తున్న ‘వంగవీటి’ సినిమాలో పాడిన పాట ‘చంపరా.. చంపెయ్యరా..’ను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టేశాడు. ఆ పాట విని ఎవరు మంచి సింగరో చెప్పాలంటూ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్, అల్లు అర్జున్, పవన్, రవితేజ అభిమానులకు ఓ విన్నపం పడేశాడు. 
 
అంతెందుకు నేరుగా పవన్‌కే ఆ ప్రశ్నను సంధించాడు. అంతేకాదు.. మ్యూజిక్ డైరెక్టర్లు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లకూ తన సవాల్‌ను పెట్టాడు. ఇక, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పవన్ కల్యాణ్ ఓ ‘బిగ్గెస్ట్ సి’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించాడు. మరి ఆ ‘బిగ్గెస్ట్ సి’ అంటే ఏంటో అతడికే తెలియాలి. ఇక, ఎవరు బెస్ట్ సింగరో ఆర్జీవీ పాట విని మీరే తేల్చాలి.