1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 9 మే 2016 (14:30 IST)

నేనో చెడ్డ కొడుకుని... అలాంటి తల్లి నా నుంచి శుభాకాంక్షలు కోరుకోదు : వర్మ ట్వీట్

మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పనని మాటల మాంత్రికుడు దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఒక ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. 
 
మాతృదినోత్సవం రోజున అందరూ తమ మాతృమూర్తులకి శుభాకాంక్షలు చెబుతుంటే.. రాంగోపాల్ వర్మ మాత్రం తన తల్లికి గ్రీటింగ్స్ చెప్పనంటూ సోషల్ మీడియాలో నానా రభస చేస్తున్నాడు. 
 
అంతేకాదు ''నేనో చెడ్డ కొడుకునని నా తల్లి అనుకుంటుంది'. మంచి తల్లి ఎప్పుడూ చెడ్డ కొడుకు నుంచి శుభాకాంక్షలు కోరుకోదు. అందుకే ఆమెకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పను'' అని వర్మ ట్వీట్‌లో చెప్పాడు.