శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (16:45 IST)

ఆర్బీ చౌదరి తనయుడు జితన్ రమేష్ - శృతి జంటగా "మహాలక్ష్మి"

బి.ఆర్.కె మూవీస్ పతాకంపై బాపనపల్లి రామకృష్ణ, నారాయణ రామ్‌లు నిర్మాతలుగా వెంకట్ ఎస్.ఎం.దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం "మహాలక్ష్మి". ఆర్.బి. చౌదరి తనయుడు జితన్ రమేష్, శృతి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్

బి.ఆర్.కె మూవీస్ పతాకంపై బాపనపల్లి రామకృష్ణ, నారాయణ రామ్‌లు నిర్మాతలుగా వెంకట్ ఎస్.ఎం.దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం "మహాలక్ష్మి". ఆర్.బి. చౌదరి తనయుడు జితన్ రమేష్, శృతి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభ వేడుక ఫిలింనగర్ దైవ సన్నిదానం లో ఘనంగా జరిగింది. 
 
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, జి.హెచ్.ఎం.సి. డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ క్లాప్ కొట్టారు. హీరో జితన్ రమేష్ మాట్లాడుతూ తెలుగులో విద్యార్థి సినిమా తర్వాత "మహాలక్ష్మి"చిత్ర కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా అని అన్నారు. 
 
దర్శకుడు వెంకట్ ఎస్.ఎం మాట్లాడుతూ కథని నమ్మి ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు అని అన్నారు.