గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (11:13 IST)

షకీలా బయోపిక్ : బాడీ షేపుల కోసం "ఆ" టైపులో ప్రాక్టీస్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

ముఖ్యంగా, నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా.. సినీరంగంలోకి ఎలా వచ్చారు? శృంగార తారగా ఎలా మారారు?. సినీరంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఎంతమంది ఆమెను మోసం చేశారు? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె బయోపిక్‌లో చూపించనున్నారు. 
 
ఈ బయోపిక్ చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. త్వరలో చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టబోతుంది. అయితే ఈ ప్రమోషన్స్‌లో రిచా బెల్లి డ్యాన్స్ చేయబోతుందట. 
 
దీనికోసం ఆమె ప్రత్యేకంగా బాలీవుడ్ బెల్లి డ్యాన్స్ స్పెషలిస్ట్‌ల దగ్గర కోచింగ్ తీసుకుంటుంది. రిచా చద్దా ఈ సినిమాలో నటించబోయే ముందు ష‌కీలాతో మాట్లాడి ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె బాడీ లాంగ్వేజ్ గురించి కూడా అడిగి తెలుసుకుని నటించారు. మొత్తానికి రిచా చద్దా షకీలా బయోపిక్ కోసం బాగానే కష్టపడుతుంది. ఈ చిత్రం హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది.