మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 29 జూన్ 2019 (15:38 IST)

"సాహో" సాంగ్ ఎంత ఎత్తులో షూట్ చేసారో తెలిస్తే షాకే...

'బాహుబలి' 1, 2 తరువాత ప్ర‌పంచంలో వున్న ప్ర‌తి సినిమా ల‌వ‌ర్ చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది. ఈ త‌రుణంలో సాహో మేకింగ్ మొద‌ల‌య్యేస‌రికి వారి ఆనందానికి అవ‌ధులు లేవు. సోష‌ల్ మీడియా అయితే.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ ఏమటి అనే సెర్చ్ విప‌రీతంగా జ‌రుగుతుంది. 
 
ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతుంది. మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస్ట్రియాలోని అత్య‌ద్బుత‌మైన లోకేష‌న్స్‌లో బాలీవుడ్ ఫేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ కొరియో్గ్ర‌ఫిలో సాంగ్ చిత్రీక‌ర‌ణ చేశారు. 
 
ఈ సాంగ్ కోసం చాలా అంద‌మైన లోకేష‌న్స్ చూడ‌టం జ‌రిగింది. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని చేయ‌టం జ‌రిగింది. అయితే అంత ఎత్తులో షూట్ జ‌రుగుతున్న‌ప్పుడు యూనిట్ అంతా కంగారుప‌డ‌కుండా హీరో ప్ర‌భాస్ అంద‌ర్ని స‌పోర్ట్ చేస్తూ ఎంక‌రేజ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఇంత‌లా స‌పోర్ట్ చేసినందుకు సోష‌ల్ మీడియా ద్వారా నిర్మాత‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 
 
ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.