సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (01:59 IST)

మరో హాలీవుడ్ స్థాయి సినిమా సాహో.. ప్రభాస్ డైలాగ్‌తో అదిరిన టీజర్

ఒక్క మాట‌లో చెప్పాలంటే సాహో టీజ‌ర్ అదిరిపోయింది. డైలాగ్ మాసీగా ఉన్నా, దాన్ని తీసిన విధానం య‌మ క్లాసీగా ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే స్పైడ‌ర్ మాన్ బ్యాట్‌మెన్ టైపు సినిమా ఏమో అనిపించ‌క‌మాన‌దు. సాహో టైటిల్‌, ప్ర‌భాస్ డైలాగ్, దాన్ని క‌ట్ చేసిన విధ

ఒక్క మాట‌లో చెప్పాలంటే సాహో టీజ‌ర్ అదిరిపోయింది. డైలాగ్ మాసీగా ఉన్నా, దాన్ని తీసిన విధానం య‌మ క్లాసీగా ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే స్పైడ‌ర్ మాన్ బ్యాట్‌మెన్ టైపు సినిమా ఏమో అనిపించ‌క‌మాన‌దు. సాహో టైటిల్‌, ప్ర‌భాస్ డైలాగ్, దాన్ని క‌ట్ చేసిన విధానం చూస్తుంటే క‌చ్చితంగా సాహోపై భారీ అంచ‌నాలు పెరిగిపోవ‌డం ఖాయం. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి శుక్ర‌వారం పండ‌గ అనుకొన్నారు. కానీ పండ‌గ సాహో టీజ‌ర్‌తో ఓ రోజు ముందుగానే మొదలైపోయింది.
 
బాహుబ‌లి 2తో పాటు సాహో టీజ‌ర్‌ని చూపించాల‌న్న‌ది యువీ క్రియేష‌న్స్ ఆలోచ‌న‌. అందుకే సినిమా మొద‌లై నెల రోజులు కూడా అవ్వ‌క‌ముందే టీజ‌ర్ రెడీ అయ్యింది. అయితే అనుకోకుండా ముందే లీకైపోయింది. ఇప్పుడు పూర్తి క్వాలిటీతో, అఫీషియ‌ల్‌గా చిత్ర‌బృందం సాహో టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది.
 
గత ఐదేళ్లుగా ‘బాహుబలి’ప్రాజెక్టులో లీనమైన ప్రభాస్‌ మరో సినిమా చేయని సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్‌ ఎలాంటి చిత్రంలో నటిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీతో 2018లో సరికొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తానంటూ కొత్త టీజర్‌తో ప్రభాస్‌ ప్రామిస్‌ చేశాడు.
 
ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘సాహో’ టీజర్‌ గురువారం అధికారికంగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ టీజర్‌లో ఏముందంటే..
 
ఓపెన్‌ చేస్తే, జూమ్‌ అవుట్‌... అవుట్‌... అవుట్‌... కట్‌ చేస్తే ప్రభాస్‌ కన్ను. మళ్లీ కొంచెం జూమ్‌ అవుట్‌ చేస్తే... ముఖంపై రక్తంతో ఓ కుర్చీలో కూర్చున్న ప్రభాస్‌! అప్పుడు ఓ డైలాగ్‌.
వాయిస్‌ ఓవర్‌ (విలన్‌) ఆ రక్తం చూస్తేనే అర్థమవుతుంది రా... వాణ్ణి చచ్చేంతలా కొట్టారని!
(విలన్‌) అనుచరుడు సార్‌... అది వాడి రక్తం కాదు, మన వాళ్లది. 
 
కుర్చీలో వెనక్కి పడి ఉన్న ప్రభాస్‌ మెల్లగా ముఖంపై రక్తాన్ని తుడుచు కుంటూ స్ట్రయిట్‌గా కూర్చుని డైలాగ్‌ చెబుతారు. అదేంటంటే...
 
ప్రభాస్‌ ఇట్స్‌ షో టైమ్‌!
 
శంకర్‌-ఎహసన్‌-లాయ్‌ త్రయం అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌.