ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (15:11 IST)

ప్రేమ వివాహం చేసుకుంటే తప్పేంటి : ప్రభాస్

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ప్రభాస్ వివాహ వార్తపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 
 
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్న వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ, ఆయన మరో భారీ ప్రాజెక్టుకు సంతకం చేయడం, ఆ తర్వాత అది కూడా పూర్తి చేసి త్వరలో విడుదల కానుండటం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ప్రేమ వివాహం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అది లవ్ మ్యారేజి కూడా కావొచ్చంటూ తన అభిమానుల్లో ఉత్కంఠ పెంచేశాడు.