గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (14:22 IST)

వివాదంలో చిక్కుకున్న సాయి ధరమ్ తేజ్.. శ్రీకాళహస్తిలో హారతి..

Sai Dharam Tej
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తికి వెళ్లిన సాయి తేజ్.. అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అయితే అక్కడి సుబ్రహ్మణ్యస్వామికి ఆయన స్వయంగా హారతినివ్వడం వివాదాస్పదమైంది. 
 
హీరో అయితే మాత్రం గుడిలో అలా ఎలా హారతి ఇస్తాడంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. సాధారణంగా శ్రీకాళహస్తిలో పూజారి తప్ప మరేతర వ్యక్తులు హారతిని ఇవ్వకూడదట. అలాంటిది సాయి తేజ్ కి ఎలా పర్మిషన్ ఇచ్చారని ఆలయ అధికారులను భక్తులు నిలదీస్తున్నారట. 
 
బైక్ యాక్సిడెంట్ తర్వాత పెద్దగా బయటికి రాని సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు ప్రత్యేకంగా దేవాలయాల్లో పూజలు చేయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి "బ్రో" సినిమాలో సాయి తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.