మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 1 ఆగస్టు 2017 (08:47 IST)

మలయాళం, తెలుగు చిత్రసీమల్లో విజయ దుందుభి.. సూర్యపై కన్నేసిన సాయిపల్లవి

ఫిదా చిత్రం విజయ సంబరాల్లో ఊపిరి తిరగకుండా పాల్గొంటున్న సాయిపల్లవి తమిళ చిత్రరంగంపై కన్నేసింది. గతంలో తాను కొల్పోయిన అనేక మంచి అవకాశాలను ఇప్పుడు ఫిదా సూపర్ హిట్ నేపథ్యంలో కొలివుడ్‌నుంచి పొందాలని చూస్తున్నట్లు సమాచారం. తొలి చిత్రం ప్రేమమ్‌తో మలయాళ సిన

ఫిదా చిత్రం విజయ సంబరాల్లో ఊపిరి తిరగకుండా పాల్గొంటున్న సాయిపల్లవి తమిళ చిత్రరంగంపై కన్నేసింది. గతంలో తాను కొల్పోయిన అనేక మంచి అవకాశాలను ఇప్పుడు ఫిదా సూపర్ హిట్ నేపథ్యంలో కొలివుడ్‌నుంచి పొందాలని చూస్తున్నట్లు సమాచారం. తొలి చిత్రం ప్రేమమ్‌తో మలయాళ సినీ ప్రియుల ప్రేమాభిమానాలను పొందింది. దీంతో కోలీవుడ్‌ కన్ను సాయిపల్లవిపై పడింది. మణిరత్నం లాంటి ప్రఖ్యాత దర్శకులు అవకాశం కల్పించడానికి రెడీ అయినా, నటుడు విక్రమ్‌తో జత కట్టే ఛాన్స్‌ వచ్చినా ఎంబీబీఎస్‌ చదువుతున్నానని చెప్పి ఆ అవకాశాలను సున్నితంగానే తిరస్కరించింది. దీంతో తమిళ చిత్రపరిశ్రమ సాయిపల్లవిని మరచిపోయింది. 
 
అలాంటి సమయంలో అనూహ్యంగా టాలీవుడ్‌లో ఫిదా చిత్రంలో ప్రత్యక్షమైంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసిన తెలుగు ప్రేక్షకులు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతున్నారు. తాజాగా కోలీవుడ్‌లోనూ విజయ్‌ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత తమిళంలో వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకుందట. దీంతో ఇక్కడ అవకాశాల వేట మొదలెట్టిందని సమాచారం. 
 
అందులో భాగంగా తాను కాలేజీ చదువుతున్న రోజుల్లోనే నటుడు సూర్యాకు వీరాభిమానిననీ, ఆయన చిత్రాలు మిస్‌ కాకుండా చూస్తాననీ డప్పు కొట్టుకుంటోంది. అంతే కాదు సూర్యతో రొమాన్స్‌ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అందుకు రెడీగా ఉన్నాననీ అంటోంది. ఇక నీకు ఇష్టమైన నటి ఎవరని అడిగితే వెంటనే ఇంకెవరు అనుష్కనే అని ఠక్కున చెప్పింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ,టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతోనూ తన లక్‌ను నిరూపించుకున్న సాయిపల్లవి కోలీవుడ్‌లో కరు చిత్రం కోసం ఎదురు చూస్తోంది. 
 
తన నటన ద్వారా అలనాటి మహానటి సావిత్రిని తలపిస్తున్న సాయి పల్లవి ఎక్కడ నటించినా  తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందన్న విషయంలో సందేహమెందుకు?