ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (14:38 IST)

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్ సమంత (Video)

samantha
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత మరోమారు స్పందించారు. తన వెబ్ సిరీస్ "సిటాడెల్: హనీ బన్ని" ప్రమోషన్‌లో భాగంగా ఈ అంశంపై ఆమె స్పందించారు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య - సమంతల విడాకుల అంశంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. 
 
ఈ అంశంపై ఇప్పటికే ఒకసారి స్పందించిన సమంత.. తాజాగా మరోమారు స్పందించారు. తాను ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతు కారణమన్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, తనపై వారికి ఉన్న నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. వారు తనలో ధైర్యం నింపారనీ, కష్టాలను ఎదుర్కోవడంలో వారి మద్దతు తనకెంతో సాయపడిందన్నారు. 
 
వారు తన పక్షాన నిలవకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేదన్నారు. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగాను అని సమంత చెప్పుకొచ్చారు.