సోషల్ మీడియాలో సమంత యాక్టివ్..
సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యింది సమంత. ఎప్పటికప్పుడు ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. అభ్యంతరకర కామెంట్స్‌తో కొంతమంది సమంతను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అందుకే ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది.
అలా 2 నెలలుగా సోషల్ మీడియాకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు మళ్లీ మెరిసింది. వినాయక చవితి సందర్భంగా ఇనస్టాగ్రామ్‌లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తన కొత్త సినిమా అప్‌డేట్‌ను బయటపెట్టింది.
ప్రస్తుతం ఈమె యశోద అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా టీజర్‌ను మరో వారం రోజుల్లో విడుదల చేయబోతున్న విషయాన్ని వెల్లడించడం కోసం సోషల్ మీడియాలోకి వచ్చింది సమంత.