బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (10:26 IST)

వరుణ్ తేజ్ పుట్టినరోజు 'ఫిదా'... మోషన్ పోస్టర్ అదుర్స్...

హీరోల పుట్టినరోజునాడు 'ఫిదా' అయ్యేలా.. దర్శక నిర్మాతలు పోస్టర్లను రిలీజ్‌ చేస్తుంటారు. గురువారం నటుడు వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు 'ఫిదా' మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

హీరోల పుట్టినరోజునాడు 'ఫిదా' అయ్యేలా.. దర్శక నిర్మాతలు పోస్టర్లను రిలీజ్‌ చేస్తుంటారు. గురువారం నటుడు వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు 'ఫిదా' మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. తన బ్రాండ్‌లోనే ఆయన సినిమాను తెరకెక్కిస్తున్నారు.
 
సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూ హ్యాపీడేస్‌ నుంచి బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ వరకు ఒకే తరహా ట్యూన్స్‌ను వినేట్లు చేసిన శేఖర్‌ కమ్ముల 'ఫిదా' చిత్రం మోషన్‌ పోస్టర్‌ను ఆ ఫ్లేవర్‌ కన్పించేలా చేశాడు. తనన.. ననన.. ఫిదా.. అంటూ మెలోడితో సాగే బాణీలను శక్తికాంత్‌ సమకూర్చారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి షెడ్యూల్లో వుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.