మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (14:36 IST)

బాహుబలి-2 హిందీ వెర్షన్‌: ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన పవన్ విలన్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లో ప్రతి నాయకుడిగా మెప్పించిన శరద్ కేల్కర్.. ప్రస్తుతం బాహుబలి2లో భాగమైనాడు. ఈ చిత్రంలో శరద్ కేల్కర్‌కు ఛాన్స్ రావడంతో సంతోషంలో మునిగి తేలుతున్నా

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లో ప్రతి నాయకుడిగా మెప్పించిన శరద్ కేల్కర్.. ప్రస్తుతం బాహుబలి2లో భాగమైనాడు. ఈ చిత్రంలో శరద్ కేల్కర్‌కు ఛాన్స్ రావడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. దక్షిణాది సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శరద్.. బాహుబలి సినిమాలో నటించలేదు కానీ.. బాహుబలి హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కి డబ్బింగ్ చెప్పాడు. 
 
ఈ క్రమంలో తాను రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ బాహుబలి సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేశాడు.  ఈ సందర్భంగా రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తోందంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుండగా ట్రైలర్‌ని మార్చి 15న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఆడియోను మార్చి 25న రిలీజ్ చేసేందుకు యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది.