సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (17:16 IST)

షికారులో చ‌మ‌క్ చంద్రపై సాంగ్ - జూన్ 24న సినిమా రిలీజ్‌

Chamak Chandra, Hari Kolangani, P.S.R. Kumar (Babji)
Chamak Chandra, Hari Kolangani, P.S.R. Kumar (Babji)
సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు`  శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన షికారు నుండి `దేవ‌దాసు పారు వ‌ల్ల బ్యాడు` అనే క్రేజీ సాంగ్‌ను చిత్ర బృందం శ‌నివారంనాడు ఫిలింఛాంబ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విడుద‌ల‌చేసింది.
 
అనంత‌రం చ‌మ‌క్ చంద్ర మాట్లాడుతూ, చాలాకాలం త‌ర్వాత మంచి పాత్ర పోషించాను. ఒక పాట నామీద చిత్రీక‌రించారు. అది నేను ఊహించ‌లేదు. ఇందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. నేను కేరెక్ట‌ర్ చేస్తుండ‌గానే పాట కూడా చేయించాల‌నే ఆలోచ‌న వారికి వ‌చ్చింది. నాపై తీసిన సాంగ్ యూత్‌ఫుల్ సాంగ్‌. యూత్‌ను ఆక‌ట్టుకునేందుకు వైవిధ్యంగా చిత్రించారు. ఈ సినిమా చేస్తుండ‌గానే నాకు పూర్తి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఈనెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చూసి ఆనందించండి అని తెలిపారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రి కొల‌గాని మాట్లాడుతూ, నేను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను బ‌లంగా న‌మ్మే వ్య‌క్తిని. ఓ సాంగ్ ద్వారా యూత్‌కు మెసేజ్ చెప్పాల‌నిపించింది. పాట‌ను రాయాల‌ని న‌లుగురు గీత‌ర‌చ‌యిత‌ల‌ను అనుకున్నాం. కానీ నా ఐడియాకు సింక్ కాక‌పోవ‌డంతో పాట ఇలా వుండాల‌ని వారికి చెప్పేందుకు రాస్తుండ‌గా ఆటోమేటిక్‌గా పూర్తి పాట రాసేశాను. జూన్ 24న సినిమా విడుద‌ల కాబోతోంది. అన్నారు.
 
చిత్ర నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ,  ఏదైనా సినిమాలో ఒక‌టి, రెండు పాట‌లు బాగుంటాయి. కానీ మా సినిమాలో అన్ని పాట‌లు అద్భుతంగా వున్నాయి. `మ‌న‌సు దారి త‌ప‌ప్పినే` సిద్ద్ శ్రీ‌రామ్ పాడిన పాట పాపుల‌ర్ అయింది. `ఫ్రెండ్‌షిప్‌`పై రాసిన రెండో పాట కూడా అంతేరీతిలో వుంది. ఈరోజు విడుద‌ల‌చేసింది మూడోపాట‌. ఇది కూడా ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం ముంది. పాట‌లో చ‌మ‌క్క్ చంద్ర జీవించాల‌ర‌నే చెప్పాలి. ఆయ‌న కామెడీ టైమింగ్ వేరే లెవ‌ల్‌లో వుంటుంది. ఆర్టిస్టులంతా బాగా న‌టించారు. సాంకేతిక సిబ్బంది బాగా క‌ష్ట‌ప‌డ్డారు.   షికారు సినిమా జూన్ 24న వ‌స్తోంది అన్నారు.
 
న‌టుడు, నిర్మాత డి.ఎస్‌.రావు మాట్లాడుతూ, ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. మేకింగ్‌లో వుండ‌గా వెళ్ళాను. చ‌మ‌క్‌చంద్ర‌కు సాంగ్ ఇచ్చార‌ని తెలుసుకున్నాక అసూయ ప‌డ్డాను. త‌న‌కు చాలా పెద్ద పాత్ర ఇచ్చారే అనిపించింది. కానీ ఆయ‌న చేస్తున్న న‌ట‌న నా ఆలోచ‌ను మార్చేసింది. ఈ పాట‌ను ద‌ర్శ‌కుడు తానే చ‌మ‌త్కారంగా రాశాడు. ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
 
వివేక్ కూచిభ‌ట్ట మాట్లాడుతూ, పంపిణీదారుడిగా వైజాగ్‌లో బాబ్జీగారు ప‌లు చిత్రాలు చేశారు. ఇప్పుడు నిర్మాత‌గా సినిమా చేశారు. నేను చూశాను. చాలా బాగుంది. సెకండాఫ్‌లో బాల‌య్య‌బాబుగారి ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా వుంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. చిత్ర టీమ్‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పారు.