శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (16:48 IST)

బాలు-రాజా ఇష్యూపై సునీత రెస్పాన్స్ ఏంటి...?ఉదయభాను-సునీత మధ్యలో ఉష..?

సంగీత దర్శకులు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యవహారంపై ఇటీవల సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. విదేశాల్లో తాను కంపోజ్ చేసిన పాటలను ఎస్పీబీ పాడకూడదంటూ.. ఇళయరాజా నోటీసులు ఇచ్చిన వివాదంపై సి

సంగీత దర్శకులు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యవహారంపై ఇటీవల సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. విదేశాల్లో తాను కంపోజ్ చేసిన పాటలను ఎస్పీబీ పాడకూడదంటూ.. ఇళయరాజా నోటీసులు ఇచ్చిన వివాదంపై సినీ గాయని సునీత కూడా స్పందించారు. ఇలా తాను కంపోజ్ చేసిన పాటలను ఇతరులు పాడకూడదనే షరతు రావడం మంచి పరిణామం కాదని సునీత వ్యాఖ్యానించింది. ఇళయరాజా తరహాలో మిగిలిన సంగీత దర్శకులు కూడా అదే మార్గంలో పయనిస్తే గాయకుల పరిస్థితి, భవిష్యత్తు అంధకారమేనని సునీత తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాల వివాదం చిన్న సమస్యగా తీసుకోనక్కర్లేదని.. అది పెద్ద సమస్యకు దారితీస్తుందని చెప్తున్నారు.  
 
ఇదిలా ఉంటే.. యాంకర్, హీరోయిన్ ఉదయభాను ఓ సింగర్ తనను అవమానించిందంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. పేరు చెప్పకుండా ఉదయభాను చేసిన కామెంట్స్ సునీతను ఉద్దేశించినవేనని ఆపై తెలియవచ్చింది. అప్పట్లో ఉదయభాను ఓ సింగర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తన గురించేనని సునీత తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఉదయభాను కామెంట్స్‌కు కారణం తానేనని సునీత క్లారిటీ ఇచ్చేసింది. అయితే స్టేజ్‌‍పైకి ఉదయభానును పిలవలేదని చేసిన విమర్శల పట్ల సునీత స్పందిస్తూ.. తాను కావాలనే ఆ పని చేయలేదని వివరణ ఇచ్చింది. ఉదయభాను పట్ల తాను కావాలనే అలా ప్రవర్తించలేదని, ఏదైనా ఆమెను అడగాలనుకుంటే తననే ప్రత్యక్షంగా అడిగివుండాల్సిందని చెప్పింది. 
 
కానీ ఎక్కడో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేరు చెప్పకుండా చెప్పాల్సిన అవసరం లేదని సునీత వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఉదయభాను తనను అపార్థం చేసుకుందని సునీత వివరించింది. ఉదయభాను గురించి చెప్తూనే మధ్యలో గాయని ఉష గురించి కూడా సునీత చెప్పింది. గాయని ఉషతో తనకు మంచి సంబంధాలు లేవని తేల్చేసింది.

తాను కొందరితోనే మాట్లాడుతూ.. రిజర్వ్‌గా ఉండటంతో తనకు పొగరెక్కువ అని అందరూ అనుకుంటున్నారని, కానీ నిజానికి ఇతరులు ఏమనుకుంటారోననే అభద్రతా భావంతో తాను ఎక్కువమందితో మాట్లాడనని సునీత చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తన కంటూ ఓ గీత గీసుకుంటూ హద్దుల్లో ఉంటానని.. అందుకే తనను చాలామంది అపార్థం చేసుకుంటున్నారని సునీత తన గురించి చెప్పుకొచ్చింది.