అలనాటి నటి పుష్పలత కన్నుమూశారు. ఆమెకు వయసు 87 సంవత్సరాలు. వయోభారం కారణంగా శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త, సినీ నటుడు ఏవీఎం రాజన్ వెల్లడించారు. చెన్నై టీ నగర్‌లోని తిరుమలపిళ్లై రోడ్డులో ఆమె పార్థివదేహాన్ని అభిమానులు, కుటుంబ సభ్యుల సందర్శనకు ఉంచారు.