సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 26 మే 2017 (03:27 IST)

భారీతనంలో రాజీపడని 'మామ్..' శ్రీదేవి 300 చిత్రం గట్టెక్కుతుందా?

హిమ్మత్ వాలా చిత్రంతో యావద్భారత ప్రేక్షుకులను మంత్రముగ్ధులను చేసిన సీనియర్ నటి శ్రీదేవి దశాబ్దంపైగా జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవి ఈ జూలై ఏడుతో చి

హిమ్మత్ వాలా చిత్రంతో యావద్భారత ప్రేక్షుకులను మంత్రముగ్ధులను చేసిన సీనియర్ నటి శ్రీదేవి దశాబ్దంపైగా జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవి ఈ జూలై ఏడుతో చిత్రరంగంలోకి అడుగుపెట్టి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగానే 
శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామ్‌’. ఈ చిత్రాన్ని జులై 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 
 
అయితే శ్రీదేవి ఈ  నాలుగు భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెబుతుండటం విశేషం. ఎ.ఆర్‌. రెహమాన్‌ ‘మామ్‌’ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ అలీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న శ్రీదేవి ‘తునైవన్‌’ అనే తమిళ చిత్రంతో బాలనటిగా పరిచయం అయ్యారు. 
 
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా పలు భాషల్లో నటించిన ఆమె 300వ చిత్రం ‘మామ్‌’. శ్రీదేవి మొదటి చిత్రం విడుదలైన తేదీ జులై 7, 1967. ‘మామ్‌’నికూడా అదే రోజున విడుదల చేయడానికి నిర్మాత బోనీకపూర్‌ సన్నాహాలు చేస్తున్నారు.
 
చిత్ర విజయ బాధ్యతలను తానే మోస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న శ్రీదేవి నాలుగు భాషల్లో విడుదల అవుతున్న మామ్ సినిమాను గట్టెక్కిస్తారా అనేది తాజా ప్రశ్న.