సంబంధిత వార్తలు
- శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది
- అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్, రుక్మిణి వసంత్
- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రంలో విలన్ గా విద్యుత్ జమ్వాల్
- 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల
- శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా చిత్రం కీలక షెడ్యూల్ ప్రారంభం
యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీర తో అలరించబోతున్న శ్రీమురళి
Srimurali
దేవుని అవతారాల గురించి తల్లి, ఆమె కొడుకు మధ్య సీరియస్ సంభాషణతో ట్రైలర్ ప్రారంభమైంది. అరాచకాలని అంతం చేయడానికి దేవుడు అనేక రూపాల్లో వస్తాడని, దేవుడి లానే కాదు రాక్షసడిలా కూడా రావచ్చని చెబుతుంది. నేరస్థులను నిర్మూలిస్తున్న మాస్క్ మ్యాన్ బఘీరని స్థానికులకు దేవుడి రూపంలో, పోలీసులు అతన్ని క్రిమినల్ గా చూస్తారు.
ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ కథను రాశాడు, డాక్టర్ సూరి గ్రిప్పింగ్ నేరేషన్, ఇంపాక్ట్ఫుల్ సంభాషణలతో ప్రజెంట్ చేశాడు. శ్రీమురళి పోలీసు అధికారిగా, మాస్క్ మ్యాన్ బఘీరగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రుక్మిణి వసంత్ అతని లవ్ ఇంట్రస్ట్ గా కనిపించారు. ట్రైలర్‌లో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రముఖ నటులను కూడా పరిచయం చేశారు.
AJ శెట్టి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. B అజనీష్ లోక్‌నాథ్ థంపింగ్ స్కోర్‌తో యాక్షన్ ని ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువలు ఫస్ట్-క్లాస్ గా వున్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌గా ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి సంతేహక్లు పని చేస్తున్నారు.
ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచిన బఘీర అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
