1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Star singer Sid Sriram humiliated at Hyderabad pub

పబ్‌లో గాయకుడు సిద్ శ్రీరామ్‌ను అవమానించిన పోకిరీలు

Star Singer
ముఖ సినీ నేపథ్యగాయకుడు సిద్ శ్రీరామ్‌ను పలువురు పోకిరీలు అవమానించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఆయన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని సన్‌బర్న్‌ పబ్‌లో నిర్వహించిన వేడుకకు సిద్ శ్రీరామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్‌ శ్రీరాం వస్తుండటంతో నిర్వాహకులు టిక్కెట్లు అడ్డగోలుగా విక్రయించారు. కేవలం 500 మంది లోపు సరిపోయే ఈ ప్రాంగణంలో వందలాది మందిని అనుమతించారు. 
 
సిద్‌ శ్రీరాం ఒకవైపు తన బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతుండగా పై నుంచి కొందరు ఆకతాయిలు మద్యంతోపాటు నీళ్లు చల్లారు. ఆయా బృంద సభ్యులపై అవి పడటంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపారు. ఆ తర్వాత సిద్ శ్రీరామ్ ఆ పోకిరీలపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. 
 
అయితే, ఈ కార్యక్రమానికి మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదికాకముందే.. నిర్వాహకులు అప్రమత్తమై సమస్యను పరిష్కరించారు. 
 
అనంతరం తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందిస్తూ.. 'మనసును అదుపులో పెట్టుకొంటే పనిచేసే ప్రాంతంలో భయం ఉండదంటూ' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం బహిర్గతమైంది. 
 
అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ పోలీసు అధికారుల పాత్రపై పలు ఆరోపణలు వస్తున్నాయి.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కార్తీక్ దీపం డాక్టర్ బాబుపై ట్రోలింగ్.. వంటలక్కను గౌరవించండి.. తర్వాత..?