శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (22:05 IST)

సింగర్ సిద్ శ్రీరామ్‌కు పబ్‌లో అవమానం.. క్రమశిక్షణ అవసరమని పోస్ట్

singer sid sriram
ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్‌కు హైదరాబాద్ లొని ఓ పబ్‌లోఅవమానం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 సి సన్ బర్న్ పబ్‌లో సిద్ శ్రీరామ్‌కు అవమానం జరిగింది. ఈవెంట్‌కు సిద్ హాజరు కాగా అతడిపై నీళ్లు మద్యం చల్లి పోకిరీలు అవమానించారు. దాంతో సిద్ వారికి గెట్ అవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో పబ్ నిర్వాహకులు జోక్యం చేసుకుని గొడవకు ఆపారు. 
 
సెలబ్రెటీలు పబ్‌లో ఉన్నారని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దాటవేశారు. తనకు ఎదురైన ఈ అనుకోని సంఘటనతో సిద్ చాలా ఫీల్ అయ్యాడు. అందుకే తన ట్విట్టర్‌లో క్రమశిక్షణ గురించి ఓ పోస్ట్ చేసాడు. అన్నింటికంటే క్రమశిక్షణ అనేది ముఖ్యమంటూ ట్వీట్ చేసాడు. అది ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు సిద్.