బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (14:15 IST)

ప్రేమకు హద్దులుండవ్.. ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచకూడదు: ప్రియాంక చోప్రా

సమాజంలో చోటుచేసుకుంటున్న అకృత్యాలకు భయపడి ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచకూడదని, బయటకు పంపితేనే వారిలో ధైర్యం పెరుగుతుందని.. సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం అలవడుతుందని ప్రియాంక తెలిపింది. పిల్లలతో ఆడుకునేందుకు చ

సమాజంలో చోటుచేసుకుంటున్న అకృత్యాలకు భయపడి ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచకూడదని, బయటకు పంపితేనే వారిలో ధైర్యం పెరుగుతుందని.. సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం అలవడుతుందని ప్రియాంక తెలిపింది. పిల్లలతో ఆడుకునేందుకు చాలా ఇష్టపడతానని ప్రియాంక తెలిపింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక చోప్రా చాలా బోల్డ్‌గా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. 
 
బేవాచ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. తాను కేవలం ఒక వ్యక్తి ప్రేమ దగ్గరే ఆగిపోయే ప్రసక్తే లేదని తెలిపింది. జీవితంలో ప్రతి ఒక్కరితో సంబంధంలో ప్రత్యేకత, కొత్తదనం ఉంటుందని తెలిపింది. అదీకాక ప్రేమకు హద్దులు లేవని, అందుకే ప్రేమను కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయలేమని పేర్కొంది. తన కుటుంబమే తనకు పెద్ద బలం, బలహీనత అని ప్రియాంక చెప్పింది. 
 
సృజనాత్మకత కలిగిన వారంటే ఇష్టమని.. వారే జీవితానికి రంగులద్దుతారని అభిప్రాయం వ్యక్తం చేసింది. బేవాచ్ సినిమా ప్రమోషన్ ముగించుకుని ముంబైకి వచ్చిన ప్రియాంక చోప్రా.. అదిరే డ్రెస్సుతో కనిపించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.