ఆదివారం, 24 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (20:05 IST)

అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?

అభిమానులు ముద్దుగా సన్నీ అని పిలుచుకునే సన్నీ లియోన్..ఎంత అందంగా ఉంటారో అంత కంటే ఎక్కువ అందమైన మనస్సుని కలిగి ఉంటారని సినీపరిశ్రమలో చెప్పుకుంటుంటారు. అలాంటి  సన్నీ లియోన్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆమె అందాల ఆరబోత సినిమాలే.  నిజ జీవితంలో ఆమె పడిన కష్టాలను తలచుకుంటే ఎంతటి వారికైన సరే కంట తడి రాకుండా మానదట.
 
తెలుగులో మంచు మనోజ్ సరసన సన్నీ..సన్నీ..అంటూ ఆడిపాడిన సన్నీలియోన్ ఆ పాటతో తెలుగు ప్రేక్షకులకు బాగానే కనక్టయ్యింది. ఆ తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాకపోయినా సన్నీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సన్నీలియోన్ అంటే చాలు జనం..తెగ యుట్యూబ్ లలో ఆమె వీడియోలను వెతికేస్తూ ఉంటారు.  
 
చిన్న నాటి నుండి ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఆమెకు జీవితం అంటే ఏమిటో తెలిసేలా చేసింది. కష్టం విలువ తెలిసిన వారు కాబట్టే కన్న బిడ్డలు ఉండీ కూడా అనాధల్లా బ్రతుకుతున్న వృద్ద దంపతులను చేరదీసి వారికి అన్ని విధాల పూర్తి సంరక్షణమని ఏర్పాటు చేసి వారిని సొంత వారికంటే ఎక్కువగా సన్నీ చూసుకుంటున్నారట. 
 
అంతేకాదు తల్లి తండ్రులు లేని అనాథ పిల్లలను చేరవేసి వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారట. ఆమె సినిమాల ద్వారాను...లేకుంటే తాను స్థాపించిన కంపెనీల ద్వారా ఆదాయం వస్తే ఆ ఆదాయంలో 30శాతంకుపైగా వృద్థులకే ఖర్చు చేస్తోందట. ఎవరైనా ఎందుకు ఇలా ఖర్చు చేస్తున్నావని అడిగితే అది మన ధర్మం..అలానే చేయాలని అంటోందట సన్నీ..