మళ్లీ సన్నీ లియోనే టాప్ ... బాలీవుడ్ హీరోయిన్లపై ఫ్యాన్స్‌కు మోజు తగ్గిందా?

sunny loone
ఠాగూర్| Last Updated: బుధవారం, 4 డిశెంబరు 2019 (13:43 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సెక్సీ భామ సన్నీ లియోన్. ఈమె బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత పోర్న్ మూవీలకు దూరంగా ఉంటూ, తనపై పడిన ముద్రను చెరిపేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదేసమయంలో భారతీయ భాషల్లో వచ్చే ఏ ఒక్క సినీ అవకాశాన్ని ఆమె వదులుకోవడం లేదు. ఈ క్రమంలో పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు.. తమిళ, తెలుగు భాషల్లో నటించింది. దీంతో ఆమె ప్రముఖ సెర్చ్ ఇంజన్ యూహూలో అగ్రస్థానంలో నిలిచింది.

గత 2016, 2017 సంవత్సరాల్లో మోస్ట్ సెర్జ్ సెలబ్రిటీగా తొలి స్థానం సంపాదించుకున్న సన్నీ లియోన్... ఈ యేడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. గత పదేళ్ళ కాలంలో ఎక్కువ మంది నెటిజన్స్ సెర్చ్ చేసిన వివ‌రాలు యాహూ తాజాగా వెల్ల‌డించింది. ఇందులో 2019కిగాను స‌న్నీ లియాన్, బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ మొద‌టి స్థానంలో నిలిచారు.

ఆ తర్వాతి స్థానంలో 'బిగ్ బి' అమితాబ్ బ‌చ్చ‌న్, అక్ష‌య్ కుమార్ ఉన్నారు. ఇక ద‌శాబ్దంలో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా 'దంగ‌ల్' నిలిచింద‌ని యాహూ తెలిపింది. త‌ర్వాత 'బ‌జ‌రంగీ భాయీజాన్', 'పీకే', 'సుల్తాన్', 'టైగ‌ర్ జిందా హై', 'ధూమ్ 3', 'సంజూ', 'వార్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాల‌ని గ‌త‌ ద‌శాబ్ధ కాలంలో ఎక్కువ‌గా శోధించారు.దీనిపై మరింత చదవండి :