సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (14:55 IST)

హిందీ బిగ్ బాస్ కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్...

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ కార్యక్రమం మొదటి నుండి వివాదాస్పద విషయాలు ఎదుర్కొన్నప్పటికి  సక్స్‌‌స్‌‌ఫుల్‌‌గా 12వ సీజన్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు 13వ సీజన్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంపై ఘజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుజ్జార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో అసభ్యకరంగా ఉంటోందని, కుటుంబం కలిసి చూడదగిన రీతిలో లేదని ఆరోపిస్తూ కేంద్ర ప్రసారశాఖాకు లేఖ రాశారు. 
 
దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా షో ఉందని, షోలో పాల్గొంటున్న ఆడ, మగ కంటెస్టెంట్లు చాలా సన్నిహితంగా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు భారత్‌‌‌కు సంస్కృతి, సంప్రదాయాల పూర్వ వైభవం తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇలాంటి షోలు కారణంగా ఆ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటున్నాయని అన్నారు.

ఈ షో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి చూడదగిన రీతిలో లేదని మండిపడ్డారు. పైగా ఈ షో కారణంగా మైనర్లు తప్పుదారి పడతారని ఆయన వాపోయారు.