శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 19 డిశెంబరు 2019 (17:53 IST)

దొంగతనం చేసి కోసుకొని తింటున్నారు.. లబోదిబోమంటున్న కోళ్ల యజమాని

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ గ్రామంలో భీమయ్య అనే రైతు ఉపాధి కోసం కడక్నాథ్ కోళ్లు తన ఇంటి దగ్గర పెంచుకుంటున్నాడు. అయితే కొంతమంది ఆ కోళ్లను రోజూ ఒక్కొక్కటి చొప్పున ఎత్తుకెళ్ళి కోసుకొని తింటున్నారు. రోజు ఒక కోడి మాయం అవుతుండడాన్ని గమనించిన భీమయ్య కోళ్లను చోరీ చేస్తున్న దొంగలను పట్టుకునే వేటలో ఉన్నాడు. 
 
ఇప్పుడు ఒక్కటి కూడా మిగలకపోవడంతో ఏంచేయలేక బాధపడుతున్నాడు. అప్పు చేసి మరీ ఉపాధి కోసం కోళ్లు పెంచుకుంటే కోళ్లు కూడా దొంగతనం అవుతున్నాయని వాపోయాడు ఆ రైతు. భీమయ్య 10 కడక్నాథ్ కోళ్లు పెంచుకునేవాడు. ఈ కోళ్ల 1 కేజీ మాంసం ఖరీదు రూ.800 ఉంటుంది. ఇప్పుడు ఒక్కటి కూడా మిగలకపోవడంతో లబోదిబోమంటున్నాడు