అదరగొట్టేస్తున్న సన్నీ లియోన్.. యాహూ రిపోర్ట్ ఏం చెప్తుందంటే?

సెల్వి| Last Updated: గురువారం, 5 డిశెంబరు 2019 (11:25 IST)
పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్.. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తన సత్తా చాటుతూ సినిమాలు, ఐటమ్ సాంగ్‌లతో రాణిస్తోంది. తాజాగా సన్నీ లియోన్.. గూగుల్, యాహూ వంటి సెర్చ్ ఇంజన్లను సైతం హీటెక్కిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టి ఈ దశాబ్దంలోనే ''మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ''గా అగ్రస్థానంలో నిలిచింది. గత పదేళ్ల కాలంలో నెటిజన్లు ఎక్కువగా సన్నీ లియోన్ గురించే శోధించారని ప్రముఖ సెర్చింజన్ యాహూ తాజాగా ప్రకటించింది. ఫలితంగా సెర్చ్‌లో రికార్డును నమోదు చేసుకుంది.

బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీ లియోన్ వరుసగా రెండు మూడేళ్ల పాటు గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండేళ్ల పాటు గూగుల్‌లో కాస్త వెనుకబడినా.. యాహూలో మాత్రం ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గలేదు. 2019లో 'మోస్ట్ సెర్చ్‌డ్ ఫిమేల్ సెలబ్రిటీ‌'గా సన్నీ లియోన్‌ తొలి స్థానంలో నిలిచింది.దీనిపై మరింత చదవండి :