మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:22 IST)

వచ్చిన ప్రతి ఛాన్స్‌ను ఉపయోగించుకోవడంలో తప్పేముంది : సన్నీ లియోన్

వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేముందని బాలీవుడ్ నటిగా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వ్యాఖ్యానిస్తోంది. ఇటీవల విడుదలైన చిత్రం 'రయీస్‌'. ఈ చిత్రంలో 'లైలా ఓ లైలా' పాటలో ఆడిపాడింది సన్నీల

వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేముందని బాలీవుడ్ నటిగా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వ్యాఖ్యానిస్తోంది. ఇటీవల విడుదలైన చిత్రం 'రయీస్‌'. ఈ చిత్రంలో 'లైలా ఓ లైలా' పాటలో ఆడిపాడింది సన్నీలియోనీ. ఆ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ ''వచ్చిన అవకాశాలు అన్నింటిలో వినియోగించుకోవాలని అనుకుంటా. అయితే ప్రతిసారి ఇలాంటి పెద్ద అవకాశం రాదు. ఇంతలా సక్సెస్‌ కూడా అవ్వవు. కాకపోతే ప్రతిసారి పెద్ద సినిమాల్లో అవకాశం రావాలనే కోరుకుంటా. కానీ వాస్తవానికి అన్నిసార్లు అది జరగదు. ఒకప్పుడు నాకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదన్నారు.
 
చాలామంది నాకు సలహాలు, సూచనలిస్తున్నారు. అదేవిధంగా చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని సినిమాల్లో నటిస్తున్నా. ప్రతిసారి మన నటనకు ప్రశంసలు దక్కుతాయని చెప్పలేం. ఎందుకంటే కొందరికి మన నటన నచ్చొచ్చు. మరి కొందరికి నచ్చకపోవచ్చు. అది మన చేతిలో ఉండదు.'' అని చెప్పుకొచ్చింది సన్నీ లియోన్.